BDK: బూర్గంపాడు మండలం సారపాక గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గురువారం శ్రీకారం చుట్టారు. సారపాకలో ఐటీసీ సీఎస్ఆర్ నిధుల ద్వారా సుమారు 7.5 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ప్రజా మరుగుదొడ్డిని ప్రారంభించారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ సదుపాయం ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు.