»Asia Cup 2023 India Pakistan Match One Ticket Price Is Rs 57 Lakhs
INDvsPAK: ఇండియా పాకిస్థాన్ మ్యాచ్..ఒక్క టికెట్ ధర రూ.57 లక్షలు?
మాములుగా ఇండియన్ పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటే అందరిలో ఉత్సాహాం ఉంటుంది. చాలా మంది ఈ ఆటను మైదానంలోనే చూడాలనుకుంటారు. అందుకు వేల రూపాయలను లెక్కచేయక టికెట్లు కొంటుంటారు. అయితే ఆసియా కప్‌లో భాగంగా జరగనున్న మ్యాచ్ చూడాలంటే ఆస్తులు అమ్ముకోవాలేమో? ఎందుకంటే టికెట్ల ధరలు చూస్తే అలా ఉన్నాయి మరి.
Asia Cup 2023, India Pakistan match.. One ticket price is Rs. 57 lakhs
INDvsPAK: ప్రస్తుతం ఆసియా కప్ 2023(Asia Cup 2023) ట్రోఫి జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా నేపల్తో ఆడిన ఆటలో భారత్ సత్తా చాటింది. ఈ నేపథ్యంలో ఒక విషయం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ చూడాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందేననే అంటున్నారు నెటిజన్లు. వన్డే ప్రపంచకప్‌లో భారత్ -పాకిస్థాన్ (IND vs PAK) మధ్య మ్యాచ్ ఎంత రసవత్తరంగా ఉంటుందో అందరికి తెలిసిందే. అక్టోబర్ 5న అహ్మదాబాద్ వేదికగా మొదటి మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఆగస్టు 29, సెప్టెంబర్ 3న అధికారికంగా టికెట్ల విక్రయించగా గంట వ్యవధిలోనే సోల్డ్ అవుట్ బోర్టు పెట్టారు. దీంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. తరువాత సెకండరీ మార్కెట్లో టికెట్లకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. సౌత్ ప్రీమియమ్ వెస్ట్ బే టికెట్ రేటు రూ.19.5 లక్షలు కాగా..\అప్పర్ టైర్‌లోని రెండు టికెట్లు మాత్రమే మిగిలి ఉన్నట్లుగా స్పోర్ట్స్ టికెట్ల ఎక్సైంజ్, రీసేల్ వెబ్సైట్ వయాగోగోలో చూపిస్తోంది. అయితే, ఒక్కో టికెట్ రూ.57 లక్షలు ఉండటం అందరినీ షాక్‌కు గురి చేసింది.
భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కే కాకుండా.. టీమ్ఇండియా ఆడనున్న మిగతా మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్ ధరలు కూడా సెకండరీ మార్కెట్లో భారీగా ఉన్నాయి. ఉదాహరణకు భారత్ -ఆస్ట్రేలియా మ్యాచ్ టికెట్ల రేంజ్ రూ.41 వేలు నుంచి రూ. 3 లక్షల వరకు పెరిగింది. అదే భారత్-ఇంగ్లాండ్ మ్యాచ్‌కు అయితే రూ.2.3 లక్షల వరకూ టికెట్లను విక్రయించారు. దీంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఐసీసీ(ICC), బీసీసీఐ(BCCI)లను ట్రోల్ చేస్తూ కామెంట్లు పెట్టారు. అభిమానుల ఆశలతో యాజమాన్యం ఆడుకుంటుందని ట్రోల్స్ చేస్తున్నారు. సామాన్యులకు అందకుండా ఉన్న ఈ ధరలపై సోషల్ మీడియాలో కూడా చర్చ నడుస్తుంది. మరీ దీనిపై బీసీసీఐ ఏలా స్పందిస్తుందో చూడాలి.