విజయనగరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి గంజాయి, మాదకద్రవ్యాల అక్రమ రవాణా నిరోధానికి పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఎస్సైలు, RPF, జీఆర్పీ బృందాలతో పాటు శునక దళం (రుద్ర, రియా) సహకారంతో రైల్వే స్టేషన్, పార్సెల్ రూమ్, ముఖ్య రైళ్లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.