NLG: రహదారి నిబంధనలు పాటించడం ద్వారానే ప్రాణ రక్షణ సాధ్యమని ఎస్పీ శరత్ చంద్రపవర్ స్పష్టం చేశారు. నార్కెట్ పల్లి మండలంలో వాహనదారులకు అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతి వాహనదారుడు విధిగా హెల్మెట్ ధరించాలని, అతివేగం, అజాగ్రత్త డ్రైవింగ్తో ముప్పు కొనితెచ్చుకోవద్దని హెచ్చరించారు.