E.G: గోపాలపురం వైసీపీ కార్యాలయం వద్ద మాజీ హోం మంత్రి తానేటి వనిత ఆధ్వర్యంలో డివిజన్ ఇంఛార్జ్, మండల అధ్యక్షులతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్గనైజేషన్ కమిటీ ప్రధాన కార్యదర్శి వజ్ర భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, వైసీపీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.