NLG: వట్టిమర్తి గ్రామంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని 8వ వార్డులో పారిశుద్ధ్య పనులను వార్డు సభ్యుడు మేడి హరికృష్ణ వేగవంతం చేశారు. పంచాయతీ సిబ్బందితో కలిసి వార్డు అంతటా బ్లీచింగ్ పౌడర్ చల్లించే పనులను ఆయన స్వయంగా పర్యవేక్షించారు. వార్డులో పారిశుద్ధ్య సమస్యలు లేకుండా చూస్తానని, సర్పంచ్, ఉపసర్పంచ్‌ల సహకారంతో 8వ వార్డును ఆదర్శంగా నిలుపుతానన్నారు.