ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణవీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ సినిమా విడుదలపై సందిగ్ధత నెలకొంది. మార్చి 19న హిందీ వెర్షన్ యథావిధిగా విడుదలవుతుండగా, తెలుగు వెర్షన్ మాత్రం వాయిదా పడే అవకాశం ఉన్నట్లు సమాచారం. డబ్బింగ్ పనుల్లో జాప్యం, థియేట్రికల్ ఇష్యూస్ వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, ఇప్పటికే తెలుగు ప్రీమియర్ షోలు కూడా రద్దయ్యాయి.