VSP: ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 30న ఏయూ కన్వెన్షన్ సెంటర్లో మాజీ ఉపకులపతుల సదస్సు నిర్వహించనున్నారు. “ఏయూ @100–పారంపర నుంచి ప్రపంచీకరణ దిశగా” అనే అంశంపై చర్చా వేదిక ఏర్పాటు చేస్తున్నారు. కార్యక్రమ పోస్టర్ను వీసీ ఆచార్య జి.పీ.రాజశేఖర్ మంగళవారం ఆవిష్కరించారు. ఇందులో పలు మాజీ వీసీలు పాల్గొననున్నారు.