MLG: వెంకటాపూర్ మండలంలోని పాలంపేట గ్రామంలో ఉన్న యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని జర్మనీ దేశానికి చెందిన మైఖేల్, లాడ్వింగ్ సోమవారం సందర్శించారు. ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ గైడ్ విజయ్ వారికి ఆలయ చరిత్ర, అద్భుత శిల్ప సంపద గురించి వివరించారు. రామప్ప ఆలయ నిర్మాణ కళను వారు ఆసక్తిగా పరిశీలించారు.