రాహుల్ గాంధీ(rahul gandhi) ప్రస్తుతం కేంద్ర పాలిత ప్రాంతం లడఖ్ పర్యటనలో ఉన్నారు. మాజీ ప్రధాని, ఆయన తండ్రి రాజీవ్ గాంధీ(rajiv gandhi) 79వ జయంతి సందర్భంగా ఆయనకు పాంగాంగ్ త్సో సరస్సు సమీపంలో నివాళులర్పించారు. అంతేకాదు ప్రధాని మోడీపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు.
Rahul Gandhi: China has taken India's land... PM Modi is lying
మాజీ ప్రధాని, రాహుల్ గాంధీ(Rahul Gandhi) తండ్రి రాజీవ్ గాంధీ(rajiv gandhi) 79వ జయంతి సందర్భంగా లడఖ్‌లోని పాంగాంగ్ సరస్సు ఒడ్డున కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆదివారం నివాళులర్పించారు. రాహుల్ KTM బైక్ పై రైడర్ లుక్‌లో ఈ సరస్సుకు చేరుకున్నట్లుగా కనిపించారు. ప్రస్తుతం కేంద్ర పాలిత ప్రాంతంలో రాహుల్ రెండు రోజుల పర్యటన చేయనున్నారు. మరోవైపు రాజీవ్ గాంధీ స్మారకం వీర్ భూమి వద్ద ఆదివారం ఉదయం కాంగ్రెస్ అధినేత్రి, రాజీవ్ సతీమణి సోనియా గాంధీ నివాళులర్పించారు. ఆమె వెంట కుమార్తె ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాజ్యసభ ఎంపీ కేసీ వేణుగోపాల్ ఉన్నారు.
#WATCH | Congress MP Rahul Gandhi pays tribute to his father and former Prime Minister Rajiv Gandhi on his birth anniversary from the banks of Pangong Tso in Ladakh pic.twitter.com/OMXWIXR3m2
మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ(modi) కూడా రాజీవ్‌కు ట్విట్టర్ వేదికగా నివాళులర్పించారు. “ఆయన జయంతి సందర్భంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జీకి నా నివాళులంటు పేర్కొన్నారు.
On his birth anniversary, my tributes to former PM Shri Rajiv Gandhi Ji.
ఈ నేపథ్యంలో లడఖ్‌లో రాహుల్ ప్రధాని మోడీని ఉద్దేశించి ఓ ప్రకటన చేశారు. చైనా సైన్యం ఇక్కడకు ప్రవేశించిందని లడఖ్ ప్రజలు చెప్పారని అన్నారు. ఇక్కడ ఒక్క అంగుళం భూమి కూడా పోలేదని ప్రధాని చెప్పారని, అది నిజం కాదన్నారు. మీరు ఇక్కడ ఎవరినైనా అడగండి అంటూ ఎద్దేవా చేశారు. ఇక్కడి భూమి చైనా(china) స్వాధీనం చేసుకుందన్నారు. వాస్తవానికి కనెక్టివిటీ లేదన్నారు. చైనా సైన్యం ఈ ప్రాంతంలోకి ప్రవేశించి..మన భూమిని లాక్కుందన్నారు.
పాంగోంగ్ త్సో సరస్సు వద్ద రాజీవ్ గాంధీకి నివాళులు అర్పించిన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సమయంలో లడఖ్‌ను సందర్శించాలనుకున్నానని గుర్తు చేశారు. అయితే లాజిస్టిక్ కారణాల వల్ల అక్కడికి వెళ్లలేకపోయానని చెప్పారు. అప్పుడు లడఖ్ పర్యటన వివరంగా జరుగుతుందని పేర్కొన్నారు. తాను లేహ్‌కు వెళ్లానని, పాంగాంగ్ తర్వాత ఇప్పుడు నుబ్రా వెళ్తున్నానని రాహుల్ అన్నారు. దీని తర్వాత తాము కార్గిల్ కూడా వెళ్తామని వెల్లడించారు. ప్రజల గుండెల్లో ఏముందో వినేందుకే ఇక్కడికి వచ్చామని రాహుల్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
पहले जो ज़मीन चारागाह के लिए इस्तेमाल होती थी वहाँ अब लद्दाख के लोग जा नहीं सकते खून अब वो चीन के क़ब्ज़े में है।
శనివారం ఒక రోజు ముందు రాహుల్ లడఖ్ నుంచి పాంగాంగ్‌కు బయలుదేరారు. శనివారం ఉదయం రాహుల్ రైడర్ లుక్‌లో ప్యాంగోంగ్ త్సో సరస్సుకు బయలుదేరాడు. రాహుల్ చేసిన ఈ సాహసానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ సమయంలో రాహుల్ KTM బైక్, స్పోర్ట్స్ హెల్మెట్‌తో లడఖ్ రోడ్లపై బైక్ నడుపుతూ కనిపించాడు. రాహుల్ గాంధీ కూడా తన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.