ATP: జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి అంపైరింగ్ పరీక్షలు ఈ నెల 18న నిర్వహిస్తున్నారు. అభ్యర్థుల వయసు 18-40 ఏళ్ల మధ్య ఉండాలని కార్యదర్శి యుగంధర్ రెడ్డి తెలిపారు. ఆసక్తి ఉన్నవారు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఉత్తీర్ణులైన ఐదుగురిని రాష్ట్రస్థాయి పరీక్షలకు ఎంపిక చేస్తారు. ఏసీఏ నిర్వహించే పోటీలకు అంపైర్లుగా పనిచేసే అవకాశం వీరికి దక్కుతుంది.