ATP: జిల్లా పోలీస్ శాఖ, ఇంకక్స్ ఏఐ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో మార్చి 28న ఏఐ హ్యాకథాన్ నిర్వహించనున్నట్లు ఎస్పీ జగదీష్ తెలిపారు. కృత్రిమ మేధస్సు రంగంలో విద్యార్థుల సృజనాత్మకతను ప్రోత్సహించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమన్నారు. ఇంజినీరింగ్, బీటెక్, ఎంసీఏ చదువుతున్న విద్యార్థులు ఈ నెల 22 వరకు ఉచితంగా పేర్లు నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు.