MBNR: పట్టణంలోని అప్పన్నపల్లి 3వ వార్డులో శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో మేయర్ గుమ్మల మమత పాల్గొని స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. భక్తుల గోవింద నామస్మరణతో అప్పన్నపల్లి వీధులన్నీ ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయాయి. ఈ కార్యక్రమం గ్రామంలో ఐక్యతను, భక్తిని ప్రతిబింబించేలా ఘనంగా సాగింది.