NLG: తెలంగాణ రాష్ట్ర ఐకేపీ వీవోఏ ఉద్యోగుల సంఘం (CITU) పిలుపులో భాగంగా జిల్లా కలెక్టరేట్ వద్ద వీవోఏలు భారీ ధర్నా నిర్వహించారు. రూ.26,000 కనీస వేతనం, ఉద్యోగ భద్రత, జీవో నం.58 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం తమ శ్రమను దోపిడీ చేస్తోందని, తక్షణమే సమస్యలు పరిష్కరించాలని నేతలు సలీం, దుర్గయ్య డిమాండ్ చేశారు.