WNP: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అమరచింత తహశీల్దార్ రవికుమార్‌కు బీజేపీ నేతలు వినతిపత్రం అందజేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాట తప్పి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని రూరల్ అధ్యక్షుడు మల్లారెడ్డి విమర్శించారు. ఈ కార్యక్రమంలో కురువ హరీశ్, శ్రీను, దామోదర్ రెడ్డి పాల్గొన్నారు.