MBNR: కౌకుంట్ల మండలం వెంకటగిరిలో గ్రామ సర్పంచ్ లక్ష్మయ్య ఆధ్వర్యంలో గ్రామ శుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రధాన వీధులు, కాలనీలు, డ్రైనేజీలు శుభ్రం చేయించి చెత్తను తొలగించారు. గ్రామ ప్రజలు కూడా తమ ఇళ్ల పరిసర ప్రాంతంలో చెత్త, చెదారం లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.