SRCL: తంగళ్ళపల్లి మండలం కస్బెకట్కూర్ గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ నిర్మాణానికి ఆదివారం భూమి పూజ నిర్వహించారు. బహుజన వీరుడు పాపన్నను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి గ్రామంలో ఆయన విగ్రహాలు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా నేతలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు పొన్నం తిరుపతి గౌడ్‌తో పాటు, సభ్యులు పాల్గొన్నారు.