TPT: నాయుడుపేటలో జరగనున్న శ్రీ పోలేరమ్మ జాతర చాటింపు కార్యక్రమానికి విచ్చేయాలని కోరుతూ ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీని మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమెను శాలువాతో సన్మానించి మంగళవారం జరిగే జాతర కార్యక్రమానికి రావాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.