GNTR: పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని గుంటూరు జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా సూచించారు. ఇప్పటివరకు చదివిన పాఠాలను పునశ్చరణ చేసి మంచి మార్కులు సాధించాలని తెలిపారు. తల్లిదండ్రులు గర్వపడేలా టాపర్లుగా నిలవాలని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. “ఆత్మవిశ్వాసంతో రాయండి.. విజయం మనదే” అని ఆకాంక్షించారు.