Hyderabad: హైదరాబాద్లో ఈ రోజు ఆ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు
మొహర్రం సందర్భంగా హైదరాబాద్లో కొన్ని చోట్ల పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మొహర్రం ఊరేగింపు సమయంలో ఆంక్షలు ఉంటాయని.. ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.
Traffic Alert: మొహర్రం ( Muharram) పండుగ సందర్భంగా హైదరాబాద్లో (hyderabad) పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మొహర్రం ఊరేగింపు సందర్భంగా ట్రాఫిక్ మళ్లించారు. ఈ రోజు మధ్యాహ్నాం 12 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఆంక్షలు కొనసాగుతాయని పోలీసులు (police) స్పష్టంచేశారు. పాతబస్తీలోని సర్దార్ మహల్, చార్మినార్, గులార్ హౌస్, పురానాహవేలీ, ఇమ్లిబన్ బస్టాండ్, చాదర్ ఘాట్లో ఆంక్షలు కొనసాగుతాయని తెలిపారు.
మధ్యాహ్నా 12 గంటల నుంచి ఈ ప్రాంతాల గుండా వాహనదారులు రావొద్దని సూచించారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాని పేర్కొన్నారు. మొహర్రం పండుగ సందర్భంగా అవాంచనీయ ఘటనలు జరగకుండా పోలీసులు (police) చర్యలు తీసుకున్నారు. మొహర్రం ఊరేగింపు మార్గాల్లో బందోబస్త్ ఏర్పాటు చేశారు. హైదరాబాద్లో (hyderabad) నిన్నటి నుంచి వాతావరణం పొడిగానే ఉంది. వర్ష ప్రభావం లేదు. కానీ ఈదురుగాలుల ప్రభావం ఉంది. మొహర్రం (Muharram) సందర్భంగా జరిగే ఊరేగింపునకు వాతావరణం అనుకూలించింది.