RR: చేవెళ్ల మున్సిపాలిటీ 13వ వార్డు (కేసారం)లో, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రోడ్లను శుభ్రం చేస్తూ ప్రజలకు పరిశుభ్రత ప్రాముఖ్యతను ఎమ్మెల్యే కాలే యాదయ్య తెలియజేశారు. మున్సిపల్ ఛైర్పర్సన్ దేవరసమత వెంకటరెడ్డి, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.