W.G: నరసాపురం మండలం వేములదీవి వెస్ట్ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం శనివారం కావడంతో భక్తులతో కిటకిటలాడింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారిని ప్రత్యేకంగా పూలతో అలంకరించారు. అలాగే స్వామి వారికి విశేష పూజ కైంకర్యాలు జరిపించినట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు పేర్కొన్నారు.