SRD: పట్టణంలో అంతర్ జిల్లా పోలీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ను ఎస్పీ పరితోష్ పంకజ్ శనివారం ప్రారంభించారు. సిబ్బందితో కలిసి ఆయన స్వయంగా బ్యాడ్మింటన్ ఆడారు. పోలీసులు విధులతో పాటు క్రీడల్లోనూ రాణించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ నెల 6వ తేదీ వరకు ఈ పోటీలు జరుగుతాయని, మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని తెలిపారు.