KMR: నాగిరెడ్డిపేట మండలం పోచారం ప్రాజెక్టు నుంచి పంటల కోసం పలు దశల్లో సాగునీటి విడుదల కొనసాగుతోంది. యాసంగి పంటల కోసం శనివారం 53 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. 18 క్యూసెక్కుల నీరు ఆవిరిగా మారి వృథాగా పోతోందని, ఎలాంటి ఇన్ఫ్లో లేదని అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు యాసంగి పంటల కోసం 1.164 TMCల నీటిని విడుదల చేయగా, ప్రస్తుత నీటి మట్టం 1.820 TMCలు ఉంది.