KMM: బోనకల్ గ్రామపంచాయతీ పరిధిలో తాగునీటి సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించారు. గ్రామంలోని ప్రతి వార్డుకు శుద్ధమైన తాగునీరు అందేలా పంచాయతీ పాలకవర్గం చర్యలు చేపట్టింది. గ్రామ ప్రజలకు ఆరోగ్యకరమైన తాగునీరు అందించడం ప్రధాన లక్ష్యంగా పంచాయతీ కృషి చేస్తుందని సర్పంచ్ జ్యోతి తెలిపారు. ప్రజలు నీటిని వృథా చేయకుండా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.