NRPT: ధన్వాడ మండల కేంద్రంలో పింఛన్లు సక్రమంగా చెల్లించడం లేదని వృద్ధులు, వికలాంగులు, వితంతువులు శనివారం మహబూబ్ నగర్-నారాయణపేట రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. వారం రోజుల్లో ఇది రెండోసారి అన్నారు. ఎస్సై వెంకటేష్ గౌడ్ జోక్యంతో పోస్టల్ అధికారులకు పింఛన్లు వెంటనే పంపిణీ చేయాలని ఆదేశించారు. అనంతరం నిరసన విరమించారు.