SDPT: కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థాన ఆస్థాన యాజ్ఞికులు శ్రీ నడిపూడి మఠం భవానయ్య (90) శనివారం తుదిశ్వాస విడిచారు. సుమారు 70 ఏళ్లుగా ఆలయ బ్రహ్మోత్సవాలు, విశేష పూజా కార్యక్రమాలను ఆయనే ప్రధానంగా ఉండి నడిపించేవారు. వీరశైవ లింగ యూత్ అధ్యక్షుడు శ్రీనివాస్ నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.