JGL: వెల్గటూర్ మండలం చెగ్యాం గ్రామంలో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. సర్పంచ్ కుమ్మరి మల్లేశ్వరి, ఉప సర్పంచ్ ఐట్ల రమేశ్ ఆధ్వర్యంలో గ్రామంలో రహదారులు, డ్రైనేజీలు, తాగునీటి సదుపాయాల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను అందించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేస్తున్నారు.