వేసవి తాపాన్ని తగ్గించేందుకు కొన్ని డ్రింక్స్ సహాయపడుతాయి. నీటిలో కీరా, నిమ్మ, పుదీనా కలిపి తాగితే డీహైడ్రేషన్ తగ్గుతుంది. గుప్పెడు వట్టి వేర్లను నీటిలో వేసి తాగితే ఒత్తిడి తగ్గి, శరీరం చల్లబడుతుంది. పుచ్చకాయ ముక్కలు, కీరా, పుదీనా మిశ్రమం తాగాలి. స్ట్రాబెర్రీ, నారింజలతో కలిపి చేసిన డ్రింక్ తాగితే మంచిది. గులాబీ రేకులు వేసిన నీరు శరీర వేడిని తగ్గిస్తుంది.