TG: గజ్వేల్లో మాజీ సీఎం, ఎమ్మెల్యే కేసీఆర్ క్యాంప్ ఆఫీసులో కాంగ్రెస్ నేతలు సీఎం రేవంత్ రెడ్డి ఫొటో పెట్టారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోకి డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షరెడ్డితో పాటు నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా వెళ్లారు. ఆఫీసులో కాంగ్రెస్కు అనుకూలంగా నినాదాలు చేశారు. దీంతో గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.