TG: హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 5లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సు ముగ్గురు ప్రైవేట్ స్కూల్ విద్యార్థినులను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒక విద్యార్థిని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.