NLG: దేవరకొండలో శనివారం జరిగిన ఐఎన్టీయూసీ నియోజకవర్గ స్థాయి సదస్సులో డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను తెచ్చి కార్మికుల హక్కులను కాలరాస్తోందని విమర్శించారు. అన్ని రంగాల్లోని గ్రామీణ కార్మికులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.