NZB: మాజీ మంత్రి డీఎస్ తనయుడు, నిజామాబాద్ నగర తొలి మేయర్ ధర్మపురి సంజయ్కు పదవి ఇవ్వాలని ఆయన అభిమానులు శనివారం డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ వద్ద నిరసన దీక్ష చేపట్టారు. ఆయన అభిమానులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ అభివృద్ధికి ఎనలేని కృషిచేస్తున్న డి.సంజయ్కు గుర్తింపు ఇవ్వాలని కోరారు.