SRPT: కోదాడ పట్టణం శ్రీరంగాపురం గ్రామానికి చెందిన రైతులు మల్లు వెంకట్ రెడ్డి, మల్లు సైదిరెడ్డి, మల్లు యేసు రెడ్డి, వారి కుటుంబ సభ్యులు పురుగుల మందు డబ్బాలతో ఆందోళనకు దిగారు. శ్రీరంగాపురం గ్రామ శివారులో తాము సాగు చేసుకుంటున్న మూడు ఎకరాల పొలంలో చేతికొచ్చిన పంటను అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ట్రాక్టర్లతో తొక్కించారని ఆరోపించారు.