TG: హైదరాబాద్‌లో ఫుట్‌పాత్ ఆక్రమణలపై GHMC కొరడా ఝుళిపించింది. 6 జోన్లలో ఫుట్‌పాత్‌ను ఆక్రమించి నిర్మాణాలు ఏర్పాటు చేయడంతో GHMC సిబ్బంది అక్రమ నిర్మాణాలను తొలగించారు. అత్తాపూర్ సర్కిల్ దగ్గర రోడ్డును ఆక్రమించిన నిర్మాణాలను కూల్చారు. ఆరాంఘర్ నుంచి డెయిరీ ఫామ్ వరకు రోడ్డును ఆక్రమించినట్లు గుర్తించారు. పోలీస్ బందోబస్తు మధ్య నిర్మాణాలను కూల్చివేశారు.