ASR: ఆపరేషన్ వజ్ర ప్రహార్‌లో భాగంగా ఇవాళ చింతపల్లి మండలం కోటగున్నల గ్రామంలో కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించామని ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా తెలిపారు. సీఐ వినోద్ బాబు, అన్నవరం ఎస్సై సాయిరామ్, సిబ్బంది, సీఆర్పీఎఫ్, ఏపీఎస్పీ సిబ్బందితో కలిసి ఇంటింటికీ తిరిగి తనిఖీలు నిర్వహించామన్నారు. గంజాయి నియంత్రణే లక్ష్యంగా గ్రామాల్లో పటిష్ట నిఘా ఏర్పాటు చేశామన్నారు.