MDK: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడిన ప్రజావాణి కార్యక్రమం ఈ నెల 23 నుంచి మండల స్థాయిలో ఆర్డీవో, తహశీల్దార్ కార్యాలయాల్లో నిర్వహించబడుతుందని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఆదే రోజు కలెక్టరేట్లో హెల్ప్ డెస్క్ ద్వారా మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తారని, మార్చి 2 నుంచి ప్రజావాణి యథావిధిగా కొనసాగుతుందని వెల్లడించారు.