KDP: సిద్ధవటం మండలం మాధవరం-1 గ్రామంలో హెల్త్ కేర్ క్లినిక్ వద్ద నేడు ఉచిత కంటి వైద్యం, ఆర్తో వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు డాక్టర్ లక్ష్మీనారాయణ BHMS తెలిపారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 వరకు శిబిరాన్ని నిర్వహిస్తారన్నారు. మండలంలోని పరిసర గ్రామాల ప్రజలు వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.