TPT: సూళ్లూరుపేటలోని కచేరి వీధిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర జువెలెర్స్లో శనివారం దోపిడి జరిగింది. కొనుగోలు చేస్తున్నట్లు నటించిన దుండగుడు షాపు యజమాని కళ్లలో కారం పొడి చల్లి సుమారు రూ.30 లక్షల విలువైన బంగారు నగలను అపహరించి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సీసీ కెమెరాల ఆధారంగా దుండగుడిని గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నారు.