TG: చాలామంది దేవుడి ముందు అగర్బత్తీలు వెలిగిస్తుంటారు. అయితే కొంతమంది ఇన్నే అగర్బత్తీలు వెలిగించాలని లెక్క చెబుతుంటారు. కానీ అసలు దేవుడికి వెలిగించే అగర్ బత్తీలకు లెక్కేలేదని పండితులు స్పష్టం చేస్తున్నారు. ఎప్పుడైనా ఇంట్లో దుష్ప్రభవాలు ఉన్నట్లు అనుమానంగా అనిపిస్తే.. సాయంత్రం ఆరు గంటలకు సాంబ్రాణీ కడ్డీలు, గుగ్గిలం లాంటి వాటితో పొగ వేయడం మంచిదంటున్నారు.