ASR: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తున్నాయని ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఉమామహేశ్వరరావు తెలిపారు. గిరిజన ప్రాంతంలో పంటల ఉత్పత్తి, ఉత్పాదకత పెంచేందుకు రైతులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. శుక్రవారం చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో నూనె గింజల పంటల సాగులో గిరిజన రైతులకు ఒక్క రోజు శిక్షణ నిర్వహించారు.