PPM: మొండెంఖల్ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో టెన్త్ విద్యార్థులకు ఆర్టీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఇంటికుప్పల రామకృష్ణారావు ఆధ్వర్యంలో ఇవాళ పరీక్ష కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్య ద్వారానే మంచి భవిష్యత్తు నిర్మాణమవుతుందని అన్నారు. పదో తరగతి పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.