ADB: ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మ్యాప్ విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని బాధిత రైతులు కోరారు. మంగళవారం డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్‌ను కలిసి తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఖానాపూర్ సర్వే నంబర్ 535లో భూమి ఉందని, తంతోలి శివారులోనూ ప్రతిపాదనలు ఉన్నాయని వారు పేర్కొన్నారు. మ్యాప్ మార్పులపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోకపోవడంతో గందరగోళం నెలకొందన్నారు.