NLG: ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నల్లగొండ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సత్యనారాయణ సూచన మేరకు. మంగళవారం నల్లగొండ ప్రభుత్వ మెడికల్ కళాశాలలోని కమ్యూనిటీ మెడిసిన్ విభాగ నేతృత్వంలో, ప్రపంచ అరోగ్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పట్టణ ఆరోగ్య శిక్షణ కేంద్రంలో పోషకాహారాన్ని పంపిణీ చేశారు.