సత్యసాయి: వంట గ్యాస్ కొరత ఉందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న వార్తలను నమ్మవద్దని సోమందేపల్లి హెచ్పీ గ్యాస్ డీలర్ లోకేశ్ శనివారం తెలిపారు. సోమందేపల్లిలో గృహ వినియోగదారులకు ఎలాంటి గ్యాస్ కొరత లేదని, శనివారం నుంచి హెచ్పీ గ్యాస్ సిలిండర్లను వినియోగదారుల ఇళ్ల వద్దకే డోర్ డెలివరీ ద్వారా సరఫరా చేస్తున్నామని చెప్పారు. ప్రజలు ఆందోళన చెందవద్దన్నారు.