ASR: అనంతగిరి మండలంలోని రొంపల్లి పంచాయతీ మరివలస ప్రాథమిక పాఠశాల శిధిలావస్థకు చేరింది. సుమారు 25 మంది విద్యార్థులు ప్రాణభయంతోనే చదువులు కొనసాగిస్తున్నారు. పైకప్పు స్లాబ్ ముక్కలు పడుతుండగా, కిటికీలు–తలుపులు దెబ్బతిన్నాయి. వర్షాకాలంలో ప్రమాదం మరింత పెరుగుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది. వెంటనే కొత్త భవనం నిర్మించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.