VZM: గజపతినగరంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మాజీ మంత్రి జనసేన PAC సభ్యురాలు పడాల అరుణ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె పార్టీ పతాకాన్ని ఎగురవేశారు. రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ రోజురోజుకు బలపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మునకాల జగన్నాధ రావు (జగన్), తదితరులు పాల్గొన్నారు.