ATP: రాప్తాడు నియోజకవర్గంలోని ఆలమూరులో అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ మూడో విడత నగదు విడుదల కార్యక్రమం జరిగింది. జిల్లా కలెక్టర్ ఆనంద్, MLA పరిటాల సునీత పాల్గొని 51,500 మంది రైతుల ఖాతాల్లో రూ.30.90 కోట్ల మెగా చెక్కును అందజేశారు. ఏటా ప్రతి రైతుకు రూ.20 వేల పెట్టుబడి సాయం అందిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. రైతుల వ్యవసాయంలో లాభాలు పొందాలని సూచించారు.