ATP: రాప్తాడు నియోజకవర్గంలోని ఐదు సాగునీటి చెరువుల్లో మత్స్యశాఖ ఆధ్వర్యంలో 65,500 చేప పిల్లలను ఎమ్మెల్యే పరిటాల సునీత విడుదల చేశారు. పీఎంఎంఎస్వై పథకంలో భాగంగా 40 శాతం సబ్సిడీతో ఈ కార్యక్రమం చేపట్టారు. ఆలమూరు చెరువులో 32 వేల చేప పిల్లలను వదిలారు. రాప్తాడు, మదిగుబ్బ, తోపుదుర్తి చెరువుల్లోనూ మిగిలిన చేప పిల్లలను వదిలినట్లు అధికారులు తెలిపారు.