Team India: టీమిండియా (Team India) కొత్త స్పాన్సర్‌ను బీసీసీఐ ప్రకటించింది. గేమింగ్ కంపెనీ డ్రీమ్ 11 స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. మెన్, ఉమెన్ జట్లకు మూడేళ్లపాటు స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. ఇప్పటివరకు బైజూస్ స్పాన్సర్‌గా ఉన్న సంగతి తెలిసిందే. డ్రీమ్ 11 ఒప్పందం గురించి పూర్తి వివరాలను బీసీసీఐ వెల్లడించలేదు.
ఈ నెల 12వ తేదీ నుంచి వెస్టిండీస్‌తో జరిగే టెస్ట్ సిరీస్ నుంచి భారత క్రికెటర్ల జెర్సీలపై డ్రీమ్ 11 లోగో ఉండనుంది. ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ 2023-25లో భాగంగా ఫస్ట్ టెస్ట్ సిరీస్ ఆడనుంది. డ్రీమ్ 11కు బీసీసీఐ చీఫ్ రోజర్ బిన్ని శుభాకాంక్షలను తెలియజేశారు. ఇటు టీమిండియా (Team India) మెన్ కిట్ స్పాన్సర్‌గా అడిడాస్ కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది. 2028 వరకు అడిడాస్ స్పాన్సర్‌గా ఉంటుంది. స్పాన్సర్ షిప్ వల్ల బీసీసీఐకి భారీగా ఆదాయం సమకూరుతుంది. ఉమెన్ కన్నా మెన్ టీమ్‌కు స్పాన్సర్ షిప్ ఎక్కువ ఆదాయం వస్తోంది. అందులో కొంత మొత్తమే క్రికెటర్ల జీతం కోసం వెచ్చిస్తారు.